Headlines

ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలను సద్వినియోగించుకోండి..

ఈరోజు ది.25.03.2023 న తాతపూడి గ్రామంలో అంగర పి.హెచ్.సి వైద్యాధికారులు డా.పి.ఎన్.ఎస్.డి.రత్న కుమారి మరియు డా.జె. అనూజ ప్రియాంక అద్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డా.జె.అనూజ ప్రియాంక మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ నెలా 3వ శనివారం బి.సి. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిభిరం నందు గర్భిణీస్త్రీ లను, బాలింతలను మరియు శస్త్రచికిత్సలు జరిగి లేవలేని స్థితిలో ఉన్న వారిని వారి ఇంటి వద్దనే పరీక్షించి మందులు అందజేయడం మరియు అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

ఈ వైద్య శిభిరములో 81 మందికి వైద్యసేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి.శ్రావణి, ఎం‌పి‌టి‌సి జె.వెంకటలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ బి.రామారావు, హెల్త్ సూపర్వైజర్స్ పి.సురేష్, టి.మేరీమణి, ఎం‌.ఎల్‌.హెచ్‌.పి కె.దీప్తి, ఆరోగ్య కార్యకర్తలు రామకృష్ణ, దేవి, 104 డి.ఇ.ఒ. ప్రసాద్ మరియు పైలట్ రాజు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.