Headlines

జగన్ రెడ్డి పని అయిపోయింది…–:బండారు సత్యానందరావు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ..

ఓ వైపు ప్రజా వ్యతిరేకత మరో వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకతతో జగన్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో గౌడ కులానికి 20 మంది బీసీ సోదరులు వైసిపి పార్టీని వీడి గ్రామ తెలుగుదేశం ఆద్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.పరమట ప్రకాశ్,పరమట గంగరాజు,పరమట నాగేశ్వరరావు,వంకా వెంకన్నబాబు,సూరిబాబు,అర్జునరావు,దుర్గాప్రసాద్,పరమట వెంకన్నబాబు,కోమలి హరికృష్ణ,అంగర రాంబాబు తదితరులకు టిడిపి కండువా కప్పి వారిని సత్యానందరావు పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితితుల దృశ్యా రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం జగన్ ని వ్యతిరేకిస్తున్నారని వైసీపి మునిగిపోయే పడవ అని అన్నారు.రాష్ట్ర బాగుకోసం,ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామని సత్యానందరావు అన్నారు.

 

 

.