తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు కొత్తపేటలోని వాడపాలెం గ్రామంలోని సత్యానందరావు స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి అచ్చెన్నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందిస్తూ పార్టీకి పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తున్న అచ్చెన్నాయుడి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు.అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాలను శిరసా వహిస్తూ ఇటీవల జరిగన ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయంలో అచ్చెన్నాయుడు కీలకపాత్ర పోషించారని అన్నారు.జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు పెట్టినా కింజారపు కుటుంబ భయపడలేదని పార్టీ కోసం,రాష్ట్ర కోసం పోరాటం చేస్తూనే వున్నారని తెలిపారు.ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి అని చూడకుండా ఇబ్బందులు గురిచేసినా పార్టీ కోసం పోరాడిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని అన్నారు.రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి ఆద్వర్యంలో తెలుగుదేశం పార్టీని విజయపధంలో నడిపిస్తామని సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.