Headlines

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదాన సముదాయానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల. …

  • వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదాన సముదాయానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చిర్ల.
  •        ముఖ్య అతిధులుగా పాల్గొన్న మాజీ ఏపీఐఐసీ చైర్మన్ శ్రీఘాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం,
  • రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి.

 

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద 5.5 కోట్ల రూపాయలతో పార్కింగ్ ప్రాంగణం వద్ద నిర్మించనున్న వకుళా మాత అన్నదాన సముదాయానికి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ ఏపీఐఐసీ చైర్మన్ శ్రీఘాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం,

రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 2019 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది అని, సుమారు 4 కోట్ల రూపాయలతో ప్రకార మండపాలు నిర్మించడం జరిగింది అని, ఆలయం చుట్టూ గ్రానైట్ వేయించడం, పార్కింగ్ ప్రాంగణం వద్ద 55 లక్షల రూపాయలతో కళ్యాణ ప్రాంగణం నిర్మించడం జరిగింది అని, ఆలయం ముందు ఉన్న ఊర చెరువును పుష్కరిణిగా తీర్చిదిద్దడం జరుగుతుంది అని, నేడు ఐదున్నర కోట్ల రూపాయలతో నిర్మించనున్న అన్నదాన సముదాయానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేయడం జరిగింది అని, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి ఉంది అని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు 55 కోట్ల రూపాయలతో చేయనున్న ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారని, రుడా నుండి వాడపల్లి కొత్త బ్రిడ్జి వరకు ఉన్న రోడ్డుకు ఎలక్ట్రికల్ పోల్స్ మరియు లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది అని ఆ పనులు కూడా అతి త్వరలోనే చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది అని అన్నారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి చిత్తశుద్ధితో జీతం లేని ఉద్యోగులులా కష్టపడి పనిచేస్తున్న చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యవర్గ సభ్యులను, అలాగే ఆలయ అధికారులు, సిబ్బందిని చిర్ల ప్రత్యేకంగా అభినందించారు.