ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం లో గల సి ఆర్ సి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు విక్టరీ వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశస్థాయిలో కబడ్డీ ఆటకు గుర్తింపు తీసుకురావడానికి రాబోయే తరాలకు కబడ్డీ ప్రాముఖ్యతను తెలియజేయడానికి చేస్తున్న కృషిలో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండగా దురదృష్టవశాస్తూ వేరే వర్గం కూడా అమిచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను గుర్తింపు నివ్వాలనుకోరగా ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఢిల్లీలో ఉన్న అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎస్టి గార్క్ రికార్డును పరిశీలించిన మీదట తాము నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కి అధికారిక గుర్తింపునిస్తూ రెండు వర్గాల వివాదానికి తెర వేసినట్లు ఆయన తెలిపారు. ఈ గుర్తింపు మాకు ఎంతో సంతోషం కలిగిస్తుందని రాబోయే రోజుల్లో కబడ్డీ ఆటను అంతర్జాతీయ స్థాయి నిలబెడతామని దేశంలో వివిధ రాష్ట్రాల నుండి ప్రాంతాల నుండి కబడ్డీ క్రీడాకారులతో పోటీలు నిర్వహిస్తామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి వై శ్రీకాంత్, సి ఆర్ సి ప్రధాన కార్యదర్శి కర్రీ అశోక్ కుమార్ రెడ్డి మరియు సిఆర్సి స్పోర్ట్స్ డైరెక్టర్ ఎన్ వీర రాఘవరెడ్డి ఎన్ అర్జున్ రావు ఏ రామకృష్ణ పి.ఎస్.ఎన్. మల్లేశ్వరరావు బి. గంగామహేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.