మంగళవారం నాడు రావులపాలెం కొత్త కాలనీకి చెందిన ఆకులు పొసియ్య కుటుంబానికి, రావులపాడు గ్రామానికి చెందిన చింతపల్లి సత్య గౌరీ కుటుంబ సభ్యులకు రెండవ నెల 21 రకాల నిత్యవసర సరుకులను సత్య సౌధ ఫౌండేషన్ తరుపున అందజేయడం జరిగిందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెల్లుబోయిన సూర్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రెటరీ చెల్లుబోయిన సుగుణ, మీడియా వ్యవహారాల డైరెక్టర్ గుత్తుల శ్రీనివాస్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పట్నాల శ్రీనివాస్, సంస్థ కో ఆర్డినేటర్స్ తెల్లాకుల వీర పావని, అనసూరి భవాని,ఇళ్ళ మహిమ కుమారి తదితరులు పాల్గొన్నారు.