డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక చేయూత అందించడమే ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో మహారాజా పాలస్ నందు జరిగిన 3 వ విడత వై.యస్.ఆర్.ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ 3 వ విడత వై.యస్.ఆర్.ఆసరా పథకం ద్వారా డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గంలో 37 కోట్లు, పి.గన్నవరం నియోజకవర్గంలో 42.59 కోట్లు, మండపేట నియోజకవర్గంలో 37.52 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గంలో 24.58 కోట్లు, రామచంద్రపురం నియోజకవర్గంలో 23.48 కోట్లు, రాజోలు నియోజకవర్గంలో 33.79 కోట్లు లబ్ది చేకూరితే ఆత్రేయపురం మండలంలో 1355 డ్వాక్రా గ్రూపులకు 10 కోట్ల 23 లక్షల 9 వేల 161 రూపాయలు కలిపి జిల్లాలోనే అధికంగా కొత్తపేట నియోజకవర్గంలో 6297 డ్వాక్రా గ్రూపులకు 54 కోట్ల 77 లక్షల 35 వేల 379 రూపాయల లబ్ది చేకూరింది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి తెలియచేశారు.
వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని, అన్ని సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది అని, అన్ని నామినేటెడ్ పదవులలో 50 శాతం మహిళలకు కేటాయించడం జరిగింది అని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 95 శాతం పైగా అమలు చేసి చూపించారని, చెప్పని అంశాలు కూడా అమలు చేస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షాలు ప్రజలకు జరుగుతున్న మంచిని చూడలేక, ఈ ప్రభుత్వానికి పెరుగుతున్న జనాధారణలో ఎక్కడ డిపాజిట్లు కూడా లేకుండా పోతారో అని భయపడి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ నీచ బుద్దిని చూపిస్తున్నారని విమర్శించారు.
ఇండ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 17000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చామని, ఎలక్షల లోపు మహిళలందరినీ వారి వారి ఇండ్ల స్థలాలలో నిలబెట్టి తీరుతామని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి.నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.