యాడికి మండల కేంద్రంలోని, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ నిర్వాహకుడు బత్తుల ప్రసాద్ తెలిపారు. యాడికిలో కాపురం ఉంటున్న ఎలిగండ్ల సూర్యనారాయణ, ఎల్లిగండ్ల లక్ష్మీదేవి, కుమారుడు విశ్వనాథ్, చౌడయ్య వీరి కుటుంబం నూతన గృహప్రవేశం చేశారు. ఇందు నిమిత్తమై అగాపే వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబం మాట్లాడుతూ మేము గృహ ప్రవేశం చేసి ఇలాగ ఆశ్రమంలో వారికి అన్నదానం చెయ్యడం మాకెంతో ఆనందంగా ఉంది అన్నారు. వారికి వారి కుటుంబానికి ఆశ్రమ పౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా కృతజ్ఞతలు తెలిపారు.