Headlines

అర్ధరాత్రి అక్రమంగా మట్టి త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సీరియస్..జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చొదిమెళ్ళ, దుగ్గిరాల లలో జిల్లా యంత్రాంగం దాడులు..

ఏలూరు..

అర్ధరాత్రి అక్రమంగా మట్టి త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సీరియస్

 

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చొదిమెళ్ళ, దుగ్గిరాల లలో జిల్లా యంత్రాంగం దాడులు

 

పోలీసులతో పాటు వెళ్లి తనిఖీలు చేసిన ఏలూరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె,ఖజావలి,హోసింగ్ పిడి కె.రవికుమార్,మునిసిపల్ కమిషనర్ ఎస్.వెంకట కృష్ణ,ఏలూరు తహశీల్దార్

 

అక్రమంగా రాత్రిళ్ళు మట్టి తరలిస్తున్న 10 టిప్పర్ల్లనులు సీజ్ చేసి, కేసు నమోదు చేసిన యంత్రాంగం

 

టిప్పర్లనును పోలీస్ స్టేషన్ కు తరలింపు,ఎఫ్ ఐ ఆర్ నమోదు

 

అక్రమ త్రవ్వకాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరికలు

 

రాత్రిళ్ళు అక్రమంగా మట్టి త్రవ్వకాలపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

 

ఇళ్ళ నిర్మాణం కోసం లబ్దిదారులు స్వయంగా మట్టిని తీసుకువెళ్లేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చాం

 

అది కూడా కేవలం పగటిపూట ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే అనుమతి

 

లబ్ధిదారుల ముసుగులో అక్రమంగా మట్టి తోలితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు