గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో బాగంగా ఈరోజు కొండపాక మండల కేంద్రంలో దరఖాస్తులను స్వీకరించిన MPDO రామ్ రెడ్డి, సర్పంచ్ చిట్టి మాధురి, పంచాయితి సెక్రెటరీ స్వప్న. ప్రజలకు తెలియని కొన్ని విషయాల పై అధికారులు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వుండేందుకు స్థానిక SI పుష్పరాజ్ అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ కు కావలసిన ఆరు గ్యారంటీ పతకాలకు సంబంధించిన దరకస్తులను అధికారులకు నేరుగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ SC సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఒక్కరోజే కాదు వచ్చేనెల 6 తారీకు వరకు ఇవ్వొచ్చు అని ఇయొక్క గొప్ప అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల సీనియర్ నాయకులు వడ్లకొండ రవీందర్, గ్రామ అధ్యక్షులు బుద్ధి రమేష్ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పర్ష రాంలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు , కొండపాక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.