Headlines

గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు..వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో జిల్లా నోడల్ అధికారి మరియు ఎల్ డి ఎం కె చంద్రశేఖర్..

పత్రికా ప్రకటన

 

 

 

*నిర్మల్, డిసెంబర్ 29 :-*

 

*వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎల్ డి ఎం కె చంద్రశేఖర్ అన్నారు*.

 

*శుక్రవారం నిర్మల్ పట్టణ కేంద్రంలో ఉదయం అంబేద్కర్ చౌరస్తా, మధ్యాహ్నం శివాజీ చౌక్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించారు*.

 

*ఈ సందర్భంగా కేంద్ర పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. క్యాలెండర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని, ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎల్ డి ఎం కె చంద్రశేఖర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ మరియు గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు*.

 

*ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు*.