ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని 140 డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి సాయిబాబా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలో భాగంగా 6 గ్యారెంటీ స్కీం లను అమలు చేసే దిశగా ప్రజా పాలన కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ క్రమంలో డివిజన్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కేంద్రాలని సందర్శించారు వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో రైతు భరోసా, మహాలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి చేయూత వంటి పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ప్రజా పాలనలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. మాటిస్తే మడమతిప్పని నైజం కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని నెరవేర్చి మాట నిలబెట్టుకుంటామన్నారు.