Headlines

ప్రజా పాలన దరఖాస్తులకు ఆదాయం కమ్యూనిటీ సర్టిఫికెట్లు జతపరచాల్సిన అవసరం లేదు–;జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

న్యాయం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29

 

 

 

ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు జత పరచాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నా మార్చడం, సవరణలు అవసరం లేదని, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఒక పాస్ ఫోటో పెడితే సరిపోతుందని ఆమె చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఆంద్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణలు అడుగుతున్నారని వచ్చే పుకార్లను నమ్మొద్దని చెప్పారు. ఏదేని సలహాలు, సూచనలు. కొరకు ప్రజలు హెల్ప్ డెస్క్ లేదా రెవెన్యూ, ఎంపిడిఓ, ఎంపిఓ, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంగ సభ్యులను సంప్రదించాలని చెప్పారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు. ఇతర వివరాలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూము 08744-241950కు కార్యాలయ పని వేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు.

ప్రజాపాలన రెండవ రోజు

74 గ్రామ పంచాయతీల్లోను, మూడు మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి 34995 గృహాల లబ్ధిదారుల నుండి 44711 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తున్నదని చెప్పారు. ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలన 481 గ్రామపంచాయతీలు,

4 మున్సిపాలిటీలలో జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ద్వారా అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

రెండవ రోజు 74 గ్రామపంచాయతీలు, 3 మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించామని, 34995 కుటుంబాల నుండి 44711 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు.

స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రసీదు అందజేయడంతో పాటు ప్రత్యేకంగా రిజిస్టర్ లో నమోదులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు రెండు షిప్టులలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఇంటికి ప్రజాపాలన దరఖాస్తులు ఉచితంగా అందచేస్తున్నామని చెప్పారు. ప్రజలు దళారుల మోసపూరిత మాటలను నమ్మొద్దని ఆమె సూచించారు. దరఖాస్తులు నింపుటకు ప్రజల సహాయార్థం ప్రతి కౌంటర్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ యంత్రాంగపు సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నమ్మొద్దని చెప్పారు. ఎవరైనా జిరాక్స్ అవసరం ఉంటే నామమాత్రపు అంటే ప్రస్తుతం ఉన్న ధర మాత్రమే తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదుతో పాటు సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిరాక్స్ కేంద్రాలపై పర్యవేక్షణ చేయాలని, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే సంబంధిత తహసీల్దార్, ఎంపిడిఓ, ఆర్డిఓ కార్యాలయంలో పిర్యాదు చేయాలని చెప్పారు. 3వ రోజు న తేదీ 30వ తేదీన యధావిధిగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని ఆమె చెప్పారు.