Headlines

దరఖాస్తు ఫారంలను పంపిణీ చేసిన అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు..

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని,కరకగూడెం గ్రామపంచాయతీ గ్రామస్తులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అధికా దరఖాస్తు స్వీకరణ ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు mpo ఎండి వి కుమార్ గారి ఆదేశాల మేరకు, సెక్రటరీ శ్యాంసుందర్ గారి ఆధ్వర్యంలో దరఖాస్తు ఫారంలను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు మరియు స్థానిక ఉప సర్పంచ్ రావుల రవి గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

👉తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ఐదు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభలలో ప్రజలందరూ పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు..

👉అలాగే కరకగూడెం గ్రామపంచాయతీ ప్రజలు 05.01.2024 మరియు 06.01.2024 తారికులలో పంచాయితీ కార్యాలయం వద్ద ప్రజా పాలన గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

 

ఈ కార్యక్రమంలో.

గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..