Headlines

వైసీపీలోకి కేశినేని నాని..?

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పార్టీల్లో నేతల జంపిగ్స్ మొదలయ్యాయి. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వేళ సీట్లు దక్కని కొందరు నేతలు టీడీపీ , జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ వీడాలని నిర్ణయించారు. నాని ఏ పార్టీలో చేరుతానేది విజయవాడ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఈ సమయంలో వైసీపీ నేతలు నానితో టచ్ లోకి వెళ్లారు. నాని వైసీపీలో చేరటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

 

కేశినేని డిసైడ్ అయ్యారా : టీడీపీకి మరో ఎంపీ గుడ్ బై చెప్పారు. ఇప్పటికే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడేందుకు డిసైడ్ అయ్యారు. తాజాగా పార్టీ నుంచి రాజీనామా నిర్ణయం పైన పునరాలోచన చేయాలనే సూచన వచ్చినా తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేని నాని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి..తన అనుచర వర్గంతో చర్చించి ఏ పార్టీలో చేరేదీ ప్రకటన చేస్తానని నాని చెప్పుకొచ్చారు. తన రాజీనామా అనేది ఇక సాంకేతికంగా మాత్రమే మిగిలి ఉందన్నారు. తన కార్యాలయంలో టీడీపీ, చంద్రబాబు ఫొటోలు తీసేయాలని నిర్ణయించారు.

 

MP Kesineni Nani likely to join in YSRCP and Contest for Vijayawada in next Elections

వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారా : ఈ సమయంలోనే నానితో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. నాని వస్తానంటే పార్టీలోకి ఆహ్వాస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు నాని టీడీపీని వీడటంతో వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అనుచర వర్గంతో చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించే ఆలోచనలో నాని ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ది ఎంపిక పైన కసరత్తు జరిగింది. కానీ, నాని ఎపిసోడ్ తో ఖరారు చేయకుండా పెండింగ్ లో ఉంచారు. నాని ఇప్పుడు వైసీపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకుంటే వైసీపీ అభ్యర్దిగా నాని విజయవాడ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అటు పొరుగు జిల్లాలో ఒక వైసీపీ ఎంపీని తమ వైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నాని వైపీపీలోకి వచ్చేలా అధికార పార్టీ నేతలు వ్యూహం సిద్దం చేస్తున్నారు.

 

నాని నెక్స్ట్ స్టెప్ : 2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని వరుసగా విజయవాడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. నియోజకవర్గ పరిధిలో తన హయాంలో కేంద్ర నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టారు. కొంత కాలంగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీలో నాని కొంత కాలంగా అసౌకర్యంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన దూతల ద్వారా సమాచారం ఇచ్చారని.. తాను చంద్రబాబు ఆదేశాల మేరకు దూరంగా ఉంటానని నాని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా ఎంపీ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో..ఇప్పుడు కేశినేని నాని వైసీపీలో చేరుతారా.. ఎంపీగా పోటీ చేస్తారా..అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.