Headlines

పెన్షన్ ఒక వరం – ఎమ్మెల్యే….

పెన్షన్ ఒక వరం – ఎమ్మెల్యే…

నంబులపూలకుంట మండలం, స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ప్రభుత్వం పెంచిన వైయస్సార్ పెన్షన్ కానుకను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి గారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైయస్సార్ పెన్షన్ కానుక అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఒకవరమన్నారు. నేడు మరో అడుగు ముందుకేసి ఇచ్చిన మాటప్రకారం రూ. 3000 రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జగనన్న అధికారం చేపట్టిన నాటి నుండి వాలంటీర్ ద్వారా ప్రతినెల 1వ తేదీ సూర్యోదయం కంటే మునుపే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందచేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమానంగా అమలుపరుస్తూ దేశంలోనే రోల్ మోడల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వల మాదిరిగా కాకుండా వాటికి పూర్తిగా భిన్నంగా అభివృద్దే లక్ష్యంగా జగనన్న అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. ప్రజలకోసం నిరంతరం శ్రమించే జగనన్నకు జనం తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, జె సి ఎస్ ఇన్చార్జులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషియల్ మీడియా సోదరులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.