24 గంటల పాటు హెల్ప్ లైన్ సెంటర్లు ర్యాగింగింగునునిరోధించేందుకు పటిష్ట నిబంధనలు..

యాంటీ ర్యాగింగ్ @1800-180-1522

 

బూర్గంపాడు 12 (న్యూస్9)

 

24 గంటల పాటు హెల్ప్ లైన్

సెంటర్లు ర్యాగింగింగునునిరోధించేందుకు పటిష్ట నిబంధనలు

 

విద్యాసంస్థల్లో ఆత్మహత్య ఘటనలపై ప్రిన్సిపాల్ ,రిజిస్టార్లు విచారణకి రావాల్సిందే.

 

యు జి సి కీలక ఆదేశాలు జారి

 

విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం బారిన పడ్డారా? కాలేజీకి వెళ్లాలంటే భయమేస్తుందా? అయితే ర్యాగింగ్ రక్కసి బాధి త విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాతీయస్థాయిలో 1800 180 1522 హెల్ప్ లైన్అందుబాటులో ఉన్నది.

 

ఇది 24 గంటల పాటు 365 రోజులు సేవలందిస్తుంది.

Help line@ antiraging ఈ -మెయిల్ కు ఫిర్యాదు చేయవచ్చు. యూజీసీ మానిటరింగ్ సెల్ నెంబర్ 0882645580 ను కూడా బాధిత విద్యార్థులు సంప్రదించవచ్చు.

అడపా దడప పలు విద్యాసంస్థల్లో కూడా ర్యాగింగ్ కనపడుతున్నది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది .ఉన్నత విద్యాసంస్థల ప్రిన్సిపాల్ లకు యూనివర్సిటీల వి షీలకు యూజీసీ లేఖలు రాసింది. ర్యాగింగ్ ను క్రిమినల్ చర్యగా పేర్కొన్న యూజీసీ దీనిని నిరోధించడానికి పటిష్ట నిబంధనలు రూపొందించినట్టు వెల్లడించింది.

 

*యు జి సి ఆదేశాలు*….

 

విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ ,యాంటీ ర్యాగింగ్ స్కాడ్ ,యాంటీ ర్యాగింగ్ సెల్ ను, ఏర్పాటు చేయాలి.

 

ర్యాగింగ్ శృతి మించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ యూనివర్సిటీ రిజిస్టార్లు విచారణకు పిలుస్తారు,

మీరు నేషనల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

 

విద్యాసంస్థలు హాస్టల్లో ప్రముఖ ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి.

 

విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ లు సెమినార్లు నిర్వహించాలి.

 

యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ఆదేశాల ప్రకారం జూనియర్లు సీనియర్ల మధ్య తారతమ్యాన్ని పూడ్చేందుకు మెంటార్షిప్పునుప్రోత్సహించాలి

 

లీగల్ కౌన్సిలింగ్ ఇచ్చి ర్యాగింగ్ నిరోధక చట్టాలు శిక్షలపై అవగాహన కల్పించాలి.