పల్లె లోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ సందర్భంగా యాడికి మండలంలోనిచందన గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లయన్స్ మరియు లియో క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

న్యూస్.9) పల్లె లోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ సందర్భంగా యాడికి మండలంలోనిచందన గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లయన్స్ మరియు లియో క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ..దాదాపు 75 మంది ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగినది. సంక్రాంతి పండుగ ఆవశ్యకతను తెలియజేస్తూ పోటీలలో పాల్గొన్న మహిళలు ఒక్కొక్కరు మన దేశ సంస్కృతి,సాంప్రదాయాలను,వ్యవసాయ రంగం గురించి, పాడి పంటల గురించి వారి వారి ముగ్గుల ద్వారా అందంగా తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం జరుగుతుండగానే యువతి యువకులు వారి వారి నృత్యాలతోనూ,పాటలతోనూ గ్రామ ప్రజలందరినీ అలరించడం జరిగినది. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రవి కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజమైన పండుగ శోభ ఈరోజు ఈ చందన గ్రామంలో కనబడుతుందని మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిదనాడు రామకృష్ణ వారి తండ్రి రామాంజనేయులు, రాజు,అశోక్ , ఆర్టీసీ రామాంజనేయులు, గంగరాజు చేతుల మీదుగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగినది. అనంతరము ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి విజేతకు సర్పంచు కుమారుడైన గుర్రం రామాంజనేయులు చేతుల మీదుగా పట్టుచీరను, రెండవ బహుమతిని న్యూ వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ చేతులు మీదుగా పట్టుచీరను, మూడవ బహుమతిని జూటూరు హరినాథ్ రెడ్డి గారి చేతులు మీదుగా పట్టుచీరను, నాలుగవ బహుమతిని రంగనాయకులు చేతుల మీదుగా పట్టుచీరను బహుకరించడం జరిగినది. అలాగే పోటీలలో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ చైర్మన్ కుల శేఖర్ నాయుడు, రీజినల్ సెక్రటరీ ఇస్మాయిల్, మురళీకృష్ణ,నాగరాజు,ప్రవీణ్,రవి కిరణ్,నరేష్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది