యాడికి మండలంలోనిలయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో రాయలచెరువులోని లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు..

న్యూస్.9) యాడికి మండలంలోనిలయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో రాయలచెరువులోని లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికైన సభ్యులను ఉచిత బస్సు సౌకర్యంతో బెంగళూరుకు తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తామని అలాగే ఉచిత భోజన వసతి కల్పించి ఆపరేషన్లు చేయించుకున్న వారిని తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుస్తామని తెలిపారు అన్ని అవయవాల కంటే నేత్ర అవయవం ముఖ్యమైనదని అందుకోసమే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని క్లబ్ సభ్యుల సహకారంతో ఈ సంవత్సరంలోనే మూడవసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మా క్లబ్బు సేవలను గుర్తించి శంకరా కంటి ఆసుపత్రి వారు ప్రతినెల ఇక్కడ క్యాంపును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని దీనిని పరిసర గ్రామాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అవసరమగు వారు క్లబ్బు ఆఫీసు నందు సంప్రదించవచ్చని తెలిపారు శంకర కంటి ఆసుపత్రి వైద్యురాలు మాట్లాడుతూ క్లబ్బు అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి యొక్క సేవలను కొనియాడారు అనంతరం శంకరా కంటి ఆసుపత్రి వైద్య సిబ్బందిని రవికుమార్ రెడ్డి క్లబ్బు సభ్యులు జ్ఞాపకాలతో సత్కరించారు క్లబ్బు సేవలను గుర్తించి హోటల్ నాగేంద్ర శిబిరానికి వచ్చిన వారందరికీ భోజన వసతిని కల్పించారు ఈ కార్యక్రమం లో లయన్ రవిప్రసాద్, రంజిత్ కుమార్, ఇస్మాయిల్,కులశేఖర్, ప్రసాద్, వికాస్ రామక్రిష్ణ, అశోక్, సూర్యనారాయణ,మురళి, శేషనంద రెడ్డి,నిదానడ రామక్రిష్ణ,మంజు, లక్ష్మణ్, రాము,దివాకర్ రెడ్డి, ప్రవీణ్,పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు