BTPS కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(INTUC అనుభందం) లో కాంట్రాక్ట్ కార్మికుల చేరిక.

ప్రెస్ నోట్:

BTPS కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(INTUC అనుభందం) లో కాంట్రాక్ట్ కార్మికుల చేరిక..

నేడు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-327 (INTUC అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బిటిపిస్ లో పని చేస్తున్న వివిధ కంపెనీల కార్మికులు బిటిపిస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లో జాయిన్ అవ్వడం జరిగింది,వారికి *తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-327 (INTUC అనుబంధ సంస్థ) రాష్ట్ర నాయకులు బానోత్ క్రిష్ణ నాయక్ గారు* కండువా కప్పి వారిని యూనియన్ లోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులకు అండగా ఉంటామని,కార్మికుల సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తామని వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని,కార్మికులకు ఏటువంటి సమస్య వచ్చిన INTUC నాయకుల దృష్టికి తీసుకొని రావాలని వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో INTUC ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎండీ. కిమత్ మియా,సుధాకర్,శంకర్,పద్మారావు,ధనలక్ష్మి మరియు కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు షేక్ ఆసిఫ్ పాషా, గాదె శేషగిరి రావు, వెన్నమల్ల సామ్రాజ్యం, రవీందర్, పీర,సాంబశివరావు, క్రిష్ణ,చాంద్ పాషా,రాము మరియు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.