సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీకి షాక్ ..పార్టీని వీడిన వేనాటి రామచంద్రారెడ్డి.

  • సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీకి షాక్
  • పార్టీని వీడిన వేనాటి రామచంద్రారెడ్డి

గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించిన వేనాటి వర్గీయులు

 

సూళ్లూరుపేట నియోజకవర్గం లో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మూల స్తంభంగా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డి మరియు వారి కుటుంబం

 

పార్టీలో గౌరవం విలువలు లేనందువలన పార్టీని వీడుతున్నాను అన్న వేనాటి రామచంద్రారెడ్డి

 

తనతోపాటు తన తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కూడా పార్టీని వీడుతుందని తెలియజేసిన రామచంద్రారెడ్డి

 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట న్యూస్ 9 శనివారం సూళ్లూరుపేట నందుగల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వేనాటి రామచంద్రారెడ్డి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించామని తన తండ్రి సుబ్బా రెడ్డి నుండి తన అన్న వేనాటి మునిరెడ్డి నుండి తన వరకు తన బిడ్డలు కూడా పార్టీకి సేవలు అందిస్తున్నామని అయితే ఇటీవల కాలంలో పార్టీలో తనకు విలువలు లేని కారణంగా తను పార్టీని వీడుతున్నట్లు తెలియజేశారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావము నుండి తెలుగుదేశం పార్టీలో మూల స్తంభం గా ఉన్నామని అప్పటినుండి తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు కూడా అనుభవించామని అప్పటినుండి ఇప్పటివరకు సులూరుపేట నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ పార్టీని కాపాడుకుంటూ పార్టీలో పని చేస్తూ అనేక సేవలు అందించామని మా అన్న వేనాటి మునిరెడ్డి ఎన్డిసిసి చైర్మన్ గా మరెన్నో పదవులు లో కొనసాగారని అలాగే నేను మొట్టమొదట నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారిగా కొనసాగాని పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో వెచ్చించామని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం ఆర్దికంగా మే మే కర్చు చేశామని తెలియజేశారు. వేనాటి రామచంద్ర రెడ్డి జెడ్పి చైర్మన్ పదవికి పోటీ చేసినటువంటి సమయంలో 2014వ సంవత్సరంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని అనేక విధాలుగా పార్టీ కోసం శ్రమించానని అయినప్పటికీ చివర ఆఖరికి జిల్లా పరిషత్ పదవి దక్కకపోగా ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని అయినా కూడా పార్టీలో తనకు తగినటువంటి గుర్తింపు లభించలేదని అప్పటినుండి ఇప్పటివరకు కూడా అంచలంచలుగా తనకు అవమానాలు పార్టీలో జరుగుతున్నాయని అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం సర్దుకుంటూ వచ్చానని ఇప్పటివరకు భరించానని ఇటీ వల చంద్రబాబు నాయుడు కోసం రాత్రి రెండు గంటల వరకు వేచి ఉన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్టీ కొసరం ఇంత కష్ట పడ్డ మాకు ఇలా చేస్తే సామాన్య కార్యకర్తలకు న్యాయం ఏం జరుగుతుందని తెలియజేశారు పార్టీ లో తనకు అన్యాయం జరిగిందని తెలిపారు. అయితే విలువలు లేనటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కాదన్నా దృక్పథంతో పార్టీని వీడి వెళ్లాలని నిర్ణయం తీసుకుని వెళుతున్నానని

ఎన్టీ రామారావు మొదలుకొని హరికృష్ణ వచ్చినప్పుడు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబులు వరకు కూడా సూళ్లూరుపేటలో వారి కోసం ఎంతో శ్రమపడి పార్టీ కోసం కష్టపడ్డామని అయితే పార్టీలో తగినంత గౌరవం విలువలు తనకు దక్కలేదని అంతేకాకుండా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలు నష్టపోతున్నారని కారణంగానే నేను పార్టీని విడిపోతున్నానని వేనాటి తెలియజేశారు ఎంతోమంది ఎమ్మెల్యేల్ని సట్టి ప్రకాశం మొదులుకొని మదనం బేటి మనెయ్య మొదలుకొని ఇప్పటి పరసారత్నం వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలను గెలిపించడం కోసం కష్టపడి పనిచేసినాము అని తెలియజేశారు ఇన్ని సంవచరాలగా పార్టీకి ఆర్దికంగా మరియు యంతో కష్టపడి పనిచేసిన తనకు విలువలు లేకుండా ఉన్న కారణంగా పార్టీ లో నుండి వెళ్ళిపోతున్నాను అని తెలియజేశారు. కొంత మంది స్వార్ధపరులు రాజకీయ ప్రయోజనాల కోసం తమను దూరం చేశారని తెలిపారు.