కైకరం గ్రామంలో రోశయ్య విగ్రహావిష్కరణ చేసిన మారం వెంకటేశ్వరరావు..

 

ఏలూరు జిల్లా, ఉంగుటూరు, మార్చ్ 16:

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాసరావు వారి సోదరుడు కోన హనుమాన్ బాబు లు కైకరం గ్రామంలో పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ దివంగత నేత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కైకరం గ్రామానికి వెళ్లే ద్వారంలో ఇప్పటికీ ఆరు విగ్రహాలు ఉండడం వాటి శరసన రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయడం సుమారు మూడు లక్షల రూపాయలు వెచ్చించి సిమెంట్ తో కాంక్రీట్ వేయించి ఆ వాతావరణం పరిశుభ్రంగా తయారు చేశారు. రోశయ్య విగ్రహావిష్కరణకు తాడేపల్లిగూడెం శ్రీ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం బోర్డు మెంబర్ మారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. కోన శ్రీనివాస్ సోదరులు సొంతం గా మూడు లక్షల రూపాయల నిధులతో స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయడం, విగ్రహాల చుట్టూ సిమెంట్ కాంక్రీట్ తో ఫ్లోరింగ్ చేయించడం వంటి కార్యక్రమాలు వారి ఉన్నతమైనటు వంటి ఆలోచనలకు పరాకాష్ట అని మారం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఓబిలిసెట్టి నటరాజ్, ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నున్న ఆనంద్ పలువురు ఆర్యవైశ్యులు కోన శ్రీనివాసరావు చేస్తున్న సేవలను కొనియాడారు. పదవికి వన్నె తెచ్చే వ్యక్తిగా కోట్లాది రూపాయలు ప్రజలకు ఉపయోగపడే రీతిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి తన వంతుగా తాను సాయం చేస్తున్నారని నటరాజు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన రోశయ్య విగ్రహావిష్కరణలో కైకరం వాసవి క్లబ్, ఆర్య వైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం వేదిక వద్ద ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కోన శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంలో కోన శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచినీరు మజ్జిగ ఆహారము వంటివి పేదలకు అందించడం ద్వారా సంతృప్తి పొందుతారని అందులో భాగంగానే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని వారి కుటుంబ సభ్యుల సహకారంతో మరింత మందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.