నేరేడ్మెట్ శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో రాజగోపురం నిర్మాణ నమూనా ఫ్లెక్సీ ని ఆవిష్కరణ.

నేరేడ్మెట్ ప్రధాన రోడ్డులో ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ధ్వజస్తంభం ముందు నిర్మించు తలపెట్టిన రాజగోపురం నిర్మాణ ప్రాజెక్టును లాంచనంగా ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు జనగామ రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఇక్కడ దేవాలయం ఏర్పడి రానున్న సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆలయం ముందు రాజగోపురం నిర్మాణం చేసేందుకు ఆలయ కమిటీ విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. దాదాపు 30 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బి ఎం వెంకట్రావు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల నమూనా రాజ గోపురం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బి.ఎం. వెంకట్రావు, వైస్ చైర్మన్ జిఎం. రమేష్ ,ఆలయ అధ్యక్షుడు బి.ఎం. రాజారామ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రాజు ప్రధాన కార్యదర్శి గంగాధరి రాజు, కార్యనిర్వాహణ కార్యదర్శులు బి .సువర్ణ లక్ష్మి, జంగిలి .శివకుమార్ ఆలయ సలహాదారులు సామల సత్యనారాయణ, కొత్తొంటి అశోక్ ,గంగాధరి కృష్ణ, ఈ గణేష్ ,ఎడ్ల శివకుమార్ తో పాటు శ్రీరామ మందిరం కమిటీ నిర్వాహకులు, మూడు గుళ్ల దేవాలయం కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.