ఎన్నికల నియమావళి అమలుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి19:

ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డిఓ, రిటర్నింగ్ ఆఫీసర్ కె.చెన్నయ్య తెలిపారు. సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు తాడేపల్లిగూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 08818 229699 కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. పట్టణంలో నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగించామన్నారు విగ్రహాలకు ముసుగులు కప్పేమన్నారు.రాజకీయ పార్టీ నాయకుల పేర్లు ఉన్న శిలాఫలకాలనుపేపర్ తో మూసివేసామన్నారు. నిష్పక్షపాతంగా వివక్ష లేకుండా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేశామన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వృద్దులు, దివ్యాoగులు కోసం హోమ్ ఓటింగు ను ఏర్పాటు చేశామని, సుమారు 200 నుంచి 220 మంది వృద్ధులను గుర్తించామన్నారు.ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనే అవకాశం లేదన్నారు. నియోజవర్గ పరిధిలో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్ బి.మురళికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.