తాడిపత్రి మరియు యాడికి తహశీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ..!

న్యూస్ 9 )యాడికి

తాడిపత్రి మరియు యాడికి తహశీల్దార్ కార్యాలయాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రికార్డ్ రూమ్ లను పరిశుభ్రంగా మరియు రికార్డులను క్రమ పద్ధతిలో అమర్చి వాటి యొక్క వివరములు తెలుపు విధంగా సూచన కార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో రికార్డు గదికి సంబంధించిన రిజిస్టరును నిర్వహించాలని, రికార్డు రూముకు సంబంధించి ప్రతినిత్యం పనిచేసేవిధంగా సి సి కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఉద్యోగులు అందరూ నిర్ణీత సమయంలో కార్యాలయమునకు హాజరు అయ్యేవిధంగా చూడాలని, బాధ్యతతో పనిచేసే విధంగా చూడాలన్నారు. అలాగే కార్యాలయానికి వచ్చే ప్రజలు వారి సమస్యలను తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలన్నారు. భూమి సమస్యల మరియు రెవెన్యూ సేవల మీద ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని నిర్ణయించిన సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువుల సరఫరా 100 శాతం ప్రతి నెలా జరగాలని