నాటుసార తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని

25 Kg ల నల్లబెల్లం స్వాదీనం

అనంతపురం SP.జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు తాడిపత్రి సబ్-డివిజనల్ పోలీస్ అధికారి P.రామకృష్ణుడు ఉత్తర్వుల మేరకు మంగళవారం యాడికి గ్రామము కోన క్రాస్ వద్ద నాటుసారాయి తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమంగా రవాణా చేస్తున్న నేనవత్ శ్రీ రామ్ నాయక్, , కొండనాయునిపల్లి గ్రామము అవుకు మండలము, నంద్యాల జిల్లా, అరెస్టు చేసి అతని వద్ద నుండి 25 Kg ల నల్లబెల్లం స్వాదీనం చేసుకొని, అతని పై కేసు నమోదు చేశారు

యాడికి మండల పరిదిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన ఎడల వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము హెచ్చరించారు అసాంఘిక కార్యకలాపాల గురించి గాని గొడవల గురించి గాని సమాచారము తెలిసిన వెంటనే యాడికి పోలీసు వారికి తెలియజేయవలెను. అని తెలిపారు సీఐ. సీఎం. ఈరన్న