నాటుసార తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని

 

25 Kg ల నల్లబెల్లం స్వాదీనం

 

అనంతపురం. ఎస్పీ.జగదీష్ ఐపీ.ఎస్ ఆదేశాల మేరకు మరియు తాడిపత్రి సబ్-డివిజనల్ పోలీస్ అధికారి P.రామకృష్ణుడు ఉత్తర్వుల మేరకు గురువారం సాయంత్రం యాడికి గ్రామము కోన క్రాస్ వద్ద నాటుసారాయి తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమంగా రవాణా చేస్తున్న ముడావత్ పీక్లా నాయక్, , సీతమ్మ తాండ గ్రామము ప్యాపిలి మండలము, నంద్యాల జిల్లాను, అరెస్టు చేసి అతని వద్ద నుండి 25 Kg ల నల్లబెల్లం స్వాదీనం చేసుకొని, అతని పై కేసు నమోదు చేశారు

యాడికి మండల పరిదిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము మరియు అసాంఘిక కార్యకలాపాల గురించి గాని గొడవల గురించి గాని సమాచారము తెలిసిన వెంటనే యాడికి పోలీసు వారికి తెలియజేయవలెను. అని అన్నారు సీఐ ఈరన్న