ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి..

న్యూస్. 9)

యాడికి పట్టణంలో ఉన్న విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అబ్దుల్ కలామ్ గారి జయంతి ని పురస్కరించుకొని విజన్ హైస్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అయన జయంతిని ఘనంగా నిర్వహించారు….మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు…విద్యార్థులు ఆయన జీవిత చరిత్రను చెబుతూ నృత్య ప్రదర్శనలు చేశారు..అలాగే “వరల్డ్ హ్యాండ్ వాష్ డే” కార్యక్రమంను నిర్వహించి విద్యార్థులకు వాటి ప్రాముఖ్యతను వివరించారు…అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పరిరక్షణ కొరకు కొన్ని జాగ్రత్తలను ఎలా తీసుకోవాలి అని వివరించారు…విజన్ కరస్పాండెంట్ విశ్వనాథ్ మాట్లాడుతూ కలామ్ గారు చిన్నప్పుడు ఉదయం 4గంటలకే లేచి పేపర్ బాయ్ గా పనిచేస్తూ ట్యూషన్ కెళ్ళి చదువుకున్నారని,ఆయన భౌతిక శాస్త్రంలో పట్టా పొంది భారత రక్షణ రంగంలో పనిచేసి క్షిపణి లను కనుగొని “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా” పేరు గావించారని , హృదయానికి వేసే స్టంట్ ను రాజు గారితో కలసి కనుగొన్నారని,అలాగే ట్యాబ్ ను కనుగొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలామ్ గారు అని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాక్షించారు… ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు..