టపాసులు అమ్మేవారు పలు జాగ్రత్తలు పాటించాలి..

న్యూస్9) యాడికి మండలంలోని

అధికారుల ఆదేశాల మేరకు రాబోవు దీపావళి పండుగ సందర్భంగాయాడికి మండలంలోని టపాసులు అమ్మకం దారులను పిలిపించి వారికి సూచనలు వివరించారు యాడికి సిఐ ఈరన్న

1) దీపావళి టపాసులు విక్రయించు దుకాణదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండవలెను.

2) టపాసులు విక్రయించే దుకాణదారులు నివాస ప్రాంతములు మరియు వాణిజ్య ప్రాంతంలో దుకాణములు ఏర్పాటు చేయరాదు.

3) టపాసులు అమ్ము దుకాణమును ఆస్ బెస్టాస్ లేదా జింక్ ఐరన్ షీట్లతో షెడ్డు నిర్మాణం చేసుకోవాలని, అగ్నికి ఆహుతి అయ్యే వస్తువులతో అనగా వెదురు, తడక, చెక్కలతో నిర్మించరాదు.

4) టపాసులు విక్రయించు షాపు షాపుకు మధ్యలో మూడు మీటర్లు/10 అడుగుల దూరం ఉండునట్లు ఏర్పాటు చేయవలెను.

5) ప్రతి దుకాణదారుడు షాపుల దగ్గర అగ్నిమాపక నిరోధక పరికరములు అయిన డై కెమికల్ పౌడర్ కలిగిన ఫైర్ ఎస్టింగర్స్ , ఇసుక మరియు వాటర్ డ్రమ్స్ ను ఏర్పాటు చేయవలెను.

టపాకాయలను 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే విక్రయించవలెను పిల్లలకు విక్రయించకూడదు.

టపాకాయలను విక్రయించువారు రాత్రి సమయంలో కరెంటు లేకపోతే చార్జింగ్ లైట్స్ వాడవలెను కానీ జనరేటర్ వాడరాదు.

టపాకాయలను విక్రయించువారు పై నిబంధనలను తూ చ తప్పకుండా పాటించాలన్నారు సిఐ ఈరన్న