Headlines

ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.. భారతదేశం మొదటి మహిళ ప్రధాన మంత్రి: స్వర్గీయ ఇందిరా గాంధీ..

  • ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు….
  • భారతదేశం మొదటి మహిళ ప్రధాన మంత్రి: స్వర్గీయ ఇందిరా గాంధీ….
  • కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు : అయిలి ప్రసాద్…
  • మున్సిపల్ చైర్మన్ : పెండ్రు రమా -సురేష్ రెడ్డీ

న్యూస్ 9 tv

మంథని (అక్టోబర్ 31)

 

మంథని పట్టణ కేంద్రం లో

గురువారం రోజున రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ “ఇందిరా గాంధీ” వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, అజీమ్ ఖాన్, గోటికార్ కిషన్ జి మాట్లాడుతూ………

భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ

దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు.రాజ‌భ‌ర‌ణాల ర‌ద్దు,బ్యాంకుల జాతీయీక‌ర‌ణ,20 సూత్రాల కార్య‌క్రమం వంటి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో దేశ ప్ర‌గ‌తికి, పేద‌ల అభ్యున్న‌తికి ఇందిరా గాంధీ ఎంత‌గానో కృషి చేశార‌ని గుర్తుచేశారు.భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చి, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణ తీసుకువచ్చిన ఘనత వారికి దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల,పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…