Headlines

ఏపీ రైతు సంఘం డిమాండ్..

న్యూస్ 9 )యాడికి

అన్నదాతలకు పెట్టుబడి రాయితీ అన్నదాత సుఖీభవ20వేల రూపాయలను వెంటనే రైతులకు అందించాలి

ఏపి రైతుసంఘము డిమాండ్

అనంతపురం జిల్లా యాడికి మండలవ్యాప్తంగా అమ్మదాతలకు పెట్టుబడి రాయితీ అన్నదాత సుఖీభవ 20వేల రూపాయలను వెంటనే రైతులకు అందించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు యాదవ్ డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ అన్నిరకములపంటలు రైతన్నలు సాగుచేశారు వర్షాభావ పరిస్థితుల వలన చీడపీడలతో పంటలు దెబ్బతిన్నాయి దానివల్ల రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు . రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుండి అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారు అందువల్ల రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకపక్క పంటలు పెట్టుబడులురాని పరిస్థితి ,ఆరకోర పండినపంటలు గిట్టుబాటు ధర లేక మరోపక్క కుటుంబాల పోషణ భారమై రైతులు ఆత్మహత్యల వైపు మలుచున్నారు అందుకే రైతాంగాన్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ 20,000వేల మొత్తాన్ని రైతులు అందించాలి ,రైతులు తీసుకున్న రుణాలు అన్నిటిని మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలి, కావున తక్షణమే రైతులకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష ,కార్యదర్శులు శ్రీరాములు, ఓబిరెడ్డి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు రైతు సంఘం నాయకులు ఆదినారాయణ యాదవ్, సిపిఐ సీనియర్ నాయకులు గరిడీ శివన్న, బండారు రాఘవ, కుళాయి రెడ్డి, వెంకటస్వామి, ఆంజనేయులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు