న్యూస్ 9 tv రిపోర్టర్
చేరాల రవీందర్
మంథని,
9640 420 733
మంథని నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుండి లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు నేత్రవైద్య సహాయకులు లయన్ పూదరి దత్తాగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున 34 మందిని ఉచిత కంటి శస్త్ర చికిత్సల కోసం చల్మెడ ఆనందరావు ఆసుపత్రి కరీంనగర్ కు తరలించారు. ఉచిత కంటి శస్త్ర చికిత్సలు, రవాణా భోజన సౌకర్యాలు కల్పించారు.కంటి శస్త్ర చికిత్సలకు సహకరిస్తున్న ప్రొఫెసర్ డా.రఘు కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డా.అనురాగ్ పవార్, శంషీర్ (రాయల్ అప్టికల్ ), బుద్దార్తి సతీష్ కుమార్ (పటేల్ ఐ కేర్ ) పాల్గొన్నారు.