Headlines

మంథ‌ని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్ లో ఉచిత వైద్య శిబిరం.. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల రవీందర్

మంథని, పెద్దపల్లి

9640420733

కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంథ‌ని అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్‌లో గురువారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని అగ్రిక‌ల్చ‌ర్ సెక్ర‌ట‌రీ స‌తీష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ శిభిరంలో 150 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్‌ స్పెషాలిటీ వైద్య పరీక్షలు చేశారు. ఆసుపత్రి డాక్టర్‌ దీక్షిత్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మెడికవర్‌ సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ మాట్లాడుతూ అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ సిబ్బందికి, రైతుల‌కు, స్థానిక ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు.

అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా సెలవులతో సంబంధం లేకుండా రాత్రి పగలనే తేడా లేకుండా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుప‌త్రి మార్కెటింగ్‌ మేనేజర్‌ కోట కర్ణాకర్, బొంగోని హారీష్, శ్రీ‌నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.