డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కొత్తపల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిల్లాపురం యాదగిరి ఆధ్వర్యంలో పుష్పాభిషేకం

జనగామ జిల్లా, లింగాల గణపురం మండలం, కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం రాజ్యాంగ పరిషత్ చే నవంబర్ 26వ రోజున ఆమోదించబడింది కావున భారత రాజ్యాంగ మహోత్సవాల లో భాగంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కొత్తపల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిల్లాపురం యాదగిరి ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల షోషల్ మీడియా కన్వీనర్ గాదెపాక విష్ణు,సీనియర్ నాయకులు దాసరి నర్సింహా, మాజీ సర్పంచ్ వంగ శ్రీనివాస్,జనగాం అంజయ్య, దాసరి వెంకటయ్య ,గ్రామ యూత్ అధ్యక్షులు దాసరి స్వామి, గ్రామ షోషల్ మీడియా కన్వీనర్ దాసరి రాజేష్,తుంగ రాణి,దాసరి రాంబాబు, మరాఠి అనిల్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.