రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీ. ఓ .1కి వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నిరసన

చిత్తూరు జిల్లా :

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీ. ఓ .1కి వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నిరసన

ప్రభుత్వం విడుదల చేసిన జి. ఓ ను వెంటనే ఉపసంహరించుకోవాలి.

యాంకర్ : రాష్ట్రం ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవో కు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర కార్యదర్శి వి.సీ .గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిగత మూడున్నర సంవత్సరాలు కావస్తున్న రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకపోగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వo చేస్తున్న మోసాలు తెలుస్తుందని ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కడానికి చీకటి జీవోలు తీసుకొచ్చిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు, రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, కార్మికుల ఇబ్బందులను కూడ చెప్పే హక్కు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఘాటుగా విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదని ఎద్దేవా చేశారు.

వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన జి. ఓ 1 ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆం.ప్ర. మహిళా సమైక్య నాయకులు కే .విజయ గౌరీ మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తామని, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఎన్నికలో చెప్పి మహిళా ఓట్లతో అధికారంలోకి వచ్చి మహిళలు సమావేశాలు, సభలు పెట్టుకోవడానికి, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయకూడదని చీకటి జీవోలు ఇవ్వడం దుర్మార్గం అన్నారు.
నిరసన కార్యక్రమంలో సిపిఐ కౌన్సిల్ సభ్యులు కే.మణి మహిళా సమైక్య సమైక్య నాయకులు ఎస్. జయ లక్ష్మి, బి .కుమారి, వి.కోమల, సిపిఐ కౌన్సిల్ సభ్యులు హెచ్. బాలాజీ రావు, పి .గజేంద్రబాబు, కె. నాగరాజ, బి. మునిస్వామి, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.