- వైసీపిని వీడి టిడిపిలో చేరిన పలువురు దళితులు
దళితులకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే అని తెలుసుకున్న దళిత సోదరులంతా వైసీపీని వీడి టిడిపిలో చేరుతున్నారని కొత్తపేట టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామానికి చెందిన పలువురి దళిత యువతకులు చిల్లి ప్రసాద్ అద్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి సత్యానందరావు వాడపాలెం గ్రామంలోని తన స్వగృహం నందు టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత సోదర,సోదరీమణుల అభివృద్ధికి కోసం అంబేద్కర్ హక్కుగా ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులను,యస్సీ కార్పొరేషన్ ని సైతం జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. విదేశీ విద్య,ఇన్నోవా కార్లు వంటి పధకాలతో దళిత వాడల్లో వెలుగునింపిన చంద్రబాబునాయుడు గారిని దళితులంతా గుర్తించారని అన్నారు. అధికార పార్టీని వీడి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం ఇదేనని సత్యానందరావు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దళితులకు సమన్యాయం జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలోను, నియోజకవర్గంలోనూ గెలిపించుకోవాలని వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని సత్యానందరావు ధీమా వ్యక్తం చేసారు. కార్యకర్తలకు ఏకష్టం వచ్చిన అండగా వుంటానాని హామీ ఇచ్చారు.
పార్టీలో చేరినవారు
కుసుమే వెంకటేష్
చిల్లి సునీల్
యన్నపు సూర్య
కుసుమే దావీదు (రాజు)
పల్లి జయరాజు
నెల్లి మనోజ్
కుంచే సూర్యప్రకాష్
నక్కా డేవిడ్
ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాసరావు, బూసి భాస్కరరావు, రెడ్డి తాతాజీ, అయిరెడ్డి రామారావు, తోరం బోసు, విళ్ళ మారుతీ, చిల్లి కుమార్, నల్లా రమణ, సిద్దాబత్తుల బహదూర్, చెల్లే రాజశేఖర్ (బాసు), బండారు కృష్ణసందీప్, కాశీ ధనరాజు, చీకరమిల్లి జాన్, అంబటి సాగర్, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, వంకా శ్రీను, పాముల సత్తిపండు తదితరులు పాల్గొన్నారు.