తేదీ :10-03-2023 న అనగా ఈరోజుఉదయం 10 గంటలకు మోడెకుర్రు గ్రామ పంచాయితీ వద్ద సర్పంచ్ శ్రీ కుడుపూడి రామలక్ష్మీ వేంకటేశ్వర రావు గారు ఆధ్వర్యంలో అవగాహణ సదస్సు ఏర్పాటు చేసి యున్నారు మోడెకుర్రు గ్రామ పంచాయతీ పరిధిలో హెల్త్ డిపార్ట్మెంట్ వారు మరియు ఏ యన్ యమ్ ఆశ వర్కర్స్-1&2 వారితో గ్రామ ఆరోగ్య సమస్యల మీద అలాగే వైరల్ ఫీవర్ మీద సమస్యలను అడిగి తెలిసికుని పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవలసిందిగా పై అధికారులను ఆదేశించడం జరిగినది. అలాగే వై యస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 60 సంవత్సరాలు నిండిన అవ్వ తాతయ్యలకు ఉచిత కళ్ళజోడు ఇవ్వడం గురించి వారి యొక్క వివరాలు చేకరించి నమోదుచేయవలసింధిగాను, గ్రామం పంచాయతీ పరిధి ఎక్కడైతే అవసరమో అక్కడ sanitaization చేయవలసిందిగా సర్పంచ్ గారు ఆదేశించడం జరిగినది. పై అవగాహన సదస్సు లో పంచాయతీ సెక్రటరీ సి . హెచ్ శాంతి, సూపర్ వైజ్ రాజబాబు , హెల్త్ అసిస్టెంట్ లు కె మాచార రావు ,జి .రమణ, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు యమ్.నఓమి . ఎన్ షర్మిల గార్లు పాల్గొన్నారు