ఎవరెన్ని కుట్రలు చేసినా దళితులు ఎప్పుడూ వై.యస్.ఆర్.సి.పి.వెంటే ఉన్నారని, ఉంటారని కుట్రలు, కుతంత్రాలు చేసి వారిని వై.సి.పి.నుండి దూరం చెయ్యాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో అందరికి అర్థం అయిందని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
కొత్తపేట మండలం అవిడి గ్రామంలో టీడీపీ నుండి వార్డు మెంబర్ గా పోటీ చేసిన కుసుమే శ్రీనివాసరావు,
నేతల బాబ్జి,
ఇసుకపట్ల రాముడు,
ఇసుకపట్ల శ్రీను,
పిట్టా మహేష్,
నామాడి గోపి,
నామాడి శేఖర్,
డొల్లా రాజరత్నం తదితరులు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో అవిడి గ్రామ సర్పంచ్ రెడ్డి చంటి, వై.యస్.ఆర్.సి.పి.నాయకులు పల్లి దిలీప్ కుమార్, ఎంపీటీసీ నేతల వెంకటలక్ష్మి రామ్మోహన్, సాకా రాజరత్నం ఆధ్వర్యంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కొంతమందిని వారికి ఇష్టం లేకపోయినా టీడీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నట్టు వారు చేసే నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ వారికి హితవుపలికారు.