కొత్తపేట //
ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది.
ప్రచారం హోరు మోగించారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం తోనే సరిపెడుతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా బియ్యం మాటే మరిచింది.
కరోనా లాక్ డౌన్ నుండి పి.ఎం.జి.కె ఏ.వై పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది.
2023 డిసెంబర్ వరకు ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ, 2024 డిసెంబర్ వరకు పథకాన్ని కొనసాగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో గమనించిన కేంద్ర ప్రభుత్వం నేరుగా కొన్నాళ్లు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేసింది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో డిసెంబర్ నెల నుండి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఇవ్వవలసిన కిలో 1 రూపాయి బియ్యం ఇవ్వటాన్ని పూర్తిగా మానివేశారు.
రేషన్ ఇంటింటి పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు బారెడు చేస్తోంది. దీనికి గాను ఎండియు ఆపరేటర్లకు రూ 18,000/- హెల్పర్ కు రూ 3000/- ఇస్తోంది..
డీజిల్ ఖర్చు, వ్యాన్ కు రిపేర్ తదితర ఖర్చులుతో పాటు ఆపరేటర్లకు వేతనాలు ఇవ్వాలి…
పని భారం అంతా ఎండీయూ ఆపరేటర్లు మోస్తుంటే, వారికి సక్రమంగా జీతాలు అందడం లేదు.
దీంతో వారు నానా అవస్థలు పడుతున్నారు.
ఇంటింటికి పంపిణీ వ్యవస్థ రాకముందు రేషన్ డీలర్లకు 8,000/- రూపాయలు కమిషన్ గా ఇచ్చేవారు. డీలర్లు 25 రోజులు రేషన్ ఇచ్చేవారు.
ప్రజలందరికీ పంపిణీ సక్రమంగా జరిగేది.
ఇంటింటికి పంపిణీ రేషన్ మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు.
దీనివలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
జీతాలు సరిపోక ,సక్రమంగా అందక ఎం డి యు ఆపరేటర్లు పస్తులుంటున్నారు.
ప్రచార హోరుకుపోయి ఖర్చులు పెంచారు. ప్రభుత్వానికి భారం తప్పితే ప్రజలకు ప్రయోజనం అంతందమాత్రంగానే ఉంది.
కనుక హంగు ఆర్భాటాలు మానుకుని రేషన్ పంపిణీ వ్యవస్థను సక్రమంగా అమలు జరపాలని కోరుతున్నాము.
🙏🙏🙏🙏
〰️〰️〰️〰️
*గుబ్బల.మూర్తి*
కొత్తపేట