Headlines

MLC ఎన్నికలకు పటిష్టమైన బందోబుస్తుతో పగడ్బంది ఏర్పాట్లు, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేల చర్యలు – చిత్తూరు SDPO కె.శ్రీనివాస మూర్తి..

చిత్తూరు జిల్లా

చిత్తూర్ జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి,IPS ఆదేశాల మేరకు రేపు జరగనున్న MLC ఎలక్షన్స్ కు పటిష్టమైన బందోబుస్తుతో పగడ్బంది ఏర్పాట్లు చేసామని చిత్తూరు SDPO కె.శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలున్నాయి ఇందులో 16 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఆ పోలింగ్ కేంద్రాలలో పోలీసు బలగాలతో పాటు ఏ.పి.ఎస్పీ బలగాలను కూడా నియమించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్షన్ నియమావళి ప్రాకారం పోలింగ్ కేంద్రాలకు 100mts వరకు ప్రజలు ఎవరు ఉండకుండా చర్యలు, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని భహిరంగ ప్రాంతాల నందు ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విదులు నిర్వహించే సిబ్బంది గుర్తింపు కార్డు కలిగిన ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించాలని, ఎవ్వరు కాని పోలింగ్ రూమ్ లోనికి ఇంకు కాని నీళ్ళు కాని మరియు మొబైల్స్ లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకుపోకుండా జాగ్రత్తలు వహించాలని, క్వూ లైన్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఓటర్లను తరవుగా చెక్ చేసిన తరువాతనే లోనికి అనుమతించాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్ నుండి పోలింగ్ కేంద్రం వరకు బ్యాల్లట్ బాక్స్ లకు ఎస్కార్ట్ చేసే విధంగా ఎర్పాటుచేసి, 12 పోలీస్ రూట్ మొబైల్ లలో ఒక్కో రూట్ మొబైల్ కి ఎస్.ఐ. స్థాయి అధికారిని ని ఇంచార్జ్ గా నియమించి మొత్తం 48 మంది సిబ్బందితో ఎన్నికలు జరుగు ప్రాంతాలలో ఎలాంటి ఘటనలు జరగకుండా నివారణ కొరకు పెట్రోలింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 5 స్ట్రైకింగ్ ఫోర్స్ లో సి.ఐ. స్థాయి అధికారిని ఇంచార్జ్ గా నియమించి మొత్తం 25 మంది సిబ్బంది తో నిరంతరం నిఘా ఉన్నాయని తెలిపారు. 1 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీం కు చిత్తూరు SDPO ఇంచార్జ్ గా ఉండి, ప్రతి మండలంలో తిరిగి, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. అధనంగా 11 MCC టీం లను ప్రతి మండలానికి నియమించి నిరంతరం ఎన్నికలు జరుగు ప్రాంతాలను పర్యవేక్షించేలా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. SVCET లోని బ్యాలట్ రిసెప్షన్ సెంటర్ వద్ద 6 కౌంటర్ లను ఏర్పాటు చేసి ఈ కౌంటర్ వద్ద 3 డి.ఎస్పీ లు, 5 సి.ఐ.లు, 2 ఆర్.ఐ.లు, 7 ఎస్.ఐ. లు మరియు 55 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసామని తెలియజేసారు.

 

ఏ రాజకీయ పార్టీ వారు కూడా ఓటర్లను తమ సొంత వాహనములో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొని రాకూడదు, ఇలాంటివి జరిగితే తీసుకోని వచ్చిన వాహనాన్ని సీజ్ చేసి వాహన దారుడి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ ఆఫీసర్ మినహా ఎవరు పోలింగ్ బూత్ లోనికి ప్రవేశించకూడదు. తమ పార్టీ వారు గెలిచారని ఎటువంటి ముందస్తు సంభారాలు జరుపుకోకూడదు. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదని అలా బలవంతంగా మద్యం, డబ్బులు ఇతర వస్తువులను ఇవ్వజూపినా అది నేరం కింద పరిగణింపబడుతుందని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ప్రలోభాలకు ఎవరైనా గురిచేస్తే ఎలక్షన్ కమిషన్ వారికి గానీ, డయల్ 100 కు లేదా చిత్తూరు పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.