Headlines

ఘనంగా వై.యస్.ఆర్.సి.పి.ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

 

  • రావులపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించి, వై.యస్.ఆర్.కు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి
  • అనంతరం కొత్తపేటలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ

 

 

ఎన్నో కష్టాలు, కుట్రలు, కక్ష సాధింపు చర్యలు ధీటుగా ఎదుర్కొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచే స్థాపించబడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేటితో 12 వసంతాలు పూర్తిచేసుకుని 13 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 

రావులపాలెంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియచేశారు.

 

అనంతరం కొత్తపేటలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా||బి.ఆర్.అంబేద్కర్, వై.యస్.ఆర్.విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు, వృద్దులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు, కుట్రలు, కుతంత్రాలను ధీటుగా ఎదుర్కొని 2011 మార్చి 12 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, ముఖ్యమంత్రిగా గెలుపొందిన తరువాత ఎటువంటి సిఫార్సులు, కమిషన్లు, లంచాలకు తావులేకుండా అర్హత ఉన్న పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను పారదర్శకతతో, నిజాయితీ నిబద్ధతలతో అమలు చేసి చూపించారని, అర్హత ఉండి పధకాలు అందలేని వారికి సంవత్సరానికి రెండు సార్లు వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉంటే అందించడం జరుగుతుంది అని, గ్రామ స్వరాజ్యం అన్న మాటను గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిజం చేసి చూపించారని కొనియాడారు.

ఇతర పార్టీల వారిలా కుళ్ళు, కుతంత్రాలు లేవు కనుకే అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందిస్తున్నారని చిర్ల అన్నారు.

 

ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.