Headlines

ధవళేశ్వరం – బొబ్బర్లంక బ్యారేజి రోడ్డు ఆధునీకరణ కొరకు నిరసన…

 

 

  • వాహన ప్రయాణికులకు పువ్వులతో,బస్సు డ్రైవర్ లకు సాలువాలతో సన్మానం…
  • వినూత్న రీతిలో నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు..

రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ఈ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులుకు సొంత పనులపై ఉన్న శ్రద్ధ సమస్యలపై ఉండటంలేదని కనీసం ప్రధాన రహదారులైన మరమ్మతులకు నోచుకోవడం లేదని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిరశన వ్యక్తం చేశారు. బొబ్బర్లంక – ధవళేశ్వరం బ్యారేజిపై రోడ్డు ఆధునీరణకై తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి నిరసన తెలిపారు. దేశానికి తలమానికమైన సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజిపై రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యిందని, రోడ్డు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వాపోయారు. బ్యారేజ్ పై ప్రయాణించే వాహనదారులు డ్రైవర్లు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు, బస్సు డ్రైవర్ లకు శాలువా కప్పి సత్యానందరావు సన్మానం చేశారు. ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లను చూసి తక్షణమే రోడ్డు నిర్మాణం చేయాలని లేదంటే పోరాటానికి సిద్దం అవుతామని సత్యానందరావు హెచ్చరించారు.