శెట్టిబలిజ స్ఫూర్తి ప్రదాత జాతి ఔనత్యానికై పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి.. –:శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

శెట్టిబలిజ స్ఫూర్తి ప్రదాత జాతి ఔనత్యానికై పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి.

 

శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్

రెడ్డి సుబ్రహ్మణ్యం

 

కొత్తపేట లో ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి నివాళులు

 

కొత్తపేట //

శెట్టిబలిజ జాతి ఔన్నత్యం కోసం అహర్నిశలు శ్రమించిన మహాయోధుడు గొప్ప సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి అని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 170వ జయంతి పురస్కరించుకుని స్థానిక ఆర్.ఎస్ బీసీ కన్వెన్షన్ హాలు ప్రాంగణం నందు జయంతి వేడుక కొత్తపేట మండలం శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం

రాష్ట్ర శెట్టిబలిజ సాధికారిక టిడిపి కన్వీనర్ కుడిపూడి సత్తిబాబు లు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.శెట్టిబలిజ జాతీయ లందరూ ఐక్యంగా ఉండాలని దొమ్మేటి వెంకట రెడ్డి సంఘాలు స్థాపించారని. సంఘ పటిష్టతకు ఎనలేని కృషి చేశారని సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన చేసిన పోరాటాల ఫలితమే సంఘంలో మనకంటూ ఒక గుర్తింపు లభించాయని ఆయన పేర్కొన్నారు.నేటి యువత సంఘ చరిత్రను దొమ్మేటి వెంకటరెడ్డి తదితరులు చేసిన సేవలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఉద్బోధించారు.

రాష్ట్ర టిడిపి శెట్టిబలిజ కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు జాతి కోసం శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా ఆయనను మెచ్చుకున్నారు.కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ జాతి కోసం కృషి చేసిన వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని

ఐక్యతతో అందరూ కలిసి మెలిసి ముందుకు వెళ్లాలని సంఘం పట్టిస్తూ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల శెట్టిబలిజ అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి గుబ్బల సత్తిపండు,గుబ్బల మూర్తి ,రెడ్డి రామకృష్ణ,రెడ్డి చంటి,కుడుపూడి వెంకటేశ్వరరావు,కడలి పెరుమాళ్లు, దూనబోయిన శ్రీనివాస్,రెడ్డి శ్రీనివాస్,, బొంతు గౌరీ శంకర్, వాసంశెట్టి సత్యనారాయణ,బొక్కా ప్రసాద్, శీలం శ్రీను, శీలం కొండబాబు,కొప్పిశెట్టి వాసు, మట్టపర్తి బొబ్బన్న,,జోగి మురళి,కడలి భీమా,కముజు తాతాజీ,ముషిని వెంకటరమణ, మేడిశెట్టి నాగేశ్వరరావు, దంగేటి సాయి,కేతా సతీష్,రాయుడు బాబీ,కముజు గోపి,కముజు శ్రీను, ఇళ్ల సురేష్ , దూనబోయిన హరినాథ్,కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, బొక్కా సుబ్రహ్మణ్యం, దూనబోయిన ప్రదీప్,కుడిపూడి శ్రీనివాసరావు, దూనబోయిన అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.