నయా సవేరా పథకం ప్రయోజనాల గురించి పార్లమెంటులో ప్రశ్నించిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు..

ఈరోజు లోక్ సభలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నయా సవేరా పథకం ప్రయోజనాల గురించి పూర్తీ వివరాలను తెలియజేయాలని ప్రశ్నించారు

 

అందుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ గారు సమాధానం ఇస్తూ, సిక్కు, జైన్, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ మరియు పార్సీ అనే ఆరు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు/అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్ ద్వారా సహాయం చేసేందుకు మంత్రిత్వ శాఖ ‘నయా సవేరా’ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్షలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు మరియు రైల్వేలతో సహా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల క్రింద గ్రూప్ A, ‘B’, & ‘C’ సర్వీసులు మరియు ఇతర సమానమైన పోస్టులకు నియామకం కోసం పోటీ పరీక్ష, ఎంపానెల్డ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల (PIAs) ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు జరుగుతోందని ఆమె వెల్లడించారు.

 

ఈ పథకం కింద 1.19 లక్షల మందికి పైగా లబ్ధిదారులు లబ్ధి పొందారని, అందులో 12,155 మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారున్నట్లు కేంద్ర మంత్రి గారు తెలిపారు