స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత..

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995 – 96 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన తమ తోటి మిత్రుడు యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామానికి చెందిన బాబు అనారోగ్యంతో మృతిచెందాడు. బాబు గత పది సంవత్సరాలుగా తాడిపత్రిలోని సిపిఐ కాలనీలో నివాసముంటు గ్రానైట్ పరిశ్రమలో గుమస్తాగా ఉద్యోగం చేసేవాడు. మిత్రుడు బాబు అనారోగ్యంతో మృతిచెందగా తోటి స్నేహితులు అతని కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు. 50 వేల రూపాయల నగదు, దాదాపు 6000 రూపాయలు విలువ చేసే బియ్యం ప్యాకెట్లు, నిత్యవసర సరుకులు అందజేశారు.