ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో అఖండ విజయం సాధించినందుకు కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బండారు ఆదేశాల మేరకు భారీ కేకును కట్ చేసి, టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ ఈ విజయం నారా చంద్రబాబు నాయుడు చాణక్యత, రాజకీయ అనుభవంతోనే సాధ్యమైందని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అహంభావానికి, అసమర్థ పాలనకు ఈ ఓటమి నిదర్శనమని, పంచుమర్తి అనురాధ విజయంతో వైసిపి ఎమ్మెల్యేలలో కూడా జగన్ ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైందని, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతారని, కొత్తపేట నియోజకవర్గ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, నైనాల శ్రీరామ చంద్రమూర్తి, ఆకుల అన్నవరం, సక్కుమల్ల రాముడు, వెన్నా భీమశంకరం, వానపల్లి పుల్లయ్య, ఆకుల ఆనంద రాజు, ఏ గోపాల కృష్ణ, ఆకుల వెంకటరెడ్డి, పళ్ళ వెంకటరెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.