Headlines

జాతీయ గ్రామీణ ఉపాధి హామీపనిలో కూలి మృతి..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు నుండి మోతుకూరు వెళ్లే మార్గం మధ్యలో శనివారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా ఉపాధి కూలీ మృతి చెందినట్లు స్థానిక ఎనర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నల్లి రాజు తెలియజేశారు.వివరాలు ప్రకారం మోతుకూరు గ్రామానికి చెందిన నేతల ఏసురత్నం (54) అనే వ్యక్తి ఉదయం 7గంటల నుండి అందరి లాగానే పంట కాలువ పూడికతీతులు తీస్తూ ఉండగా అదే సమయంలో ప్రమాదవశాస్తూ పంటకాలువలో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక తాసిల్దార్ ఐపీ.శెట్టి,ఎంపీడీవో కే.జాన్ లింకన్, ఎస్ఐ ఎస్.శివప్రసాద్ తమ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా చిర్ల బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ చాలా బాధాకరమైన విషయమని,దిగులు పడవద్దు,ఆ ధైర్య పడవద్దని, ప్రభుత్వం నుండి రావలసిన అన్ని సహాయ సహకారాలకు తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలియజేసీ మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయముగా 20వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు._

_అనంతరం మృతదేహాన్ని చిర్ల సోమ సుందర్ రెడ్డి ఫౌండేషన్ అంబులెన్స్ పై మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏస్ శివప్రసాద్ తెలియజేశారు._