Headlines

గంజాయి అక్రమ రవాణా కి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది…..

దేశంలోనే గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకి ఆంధ్రప్రదేశ్ అడ్డగా మారింది.. ఒకప్పుడు దేశంలో ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాకు నిలయంగా మారడం ఆందోళన కలిగిస్తుంది..

సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న తిరుమలలో కూడా గంజాయి జాడలు భక్తులకు ఆందోళన కలిగిస్తుంది…

రాష్ట్రంలో డ్రగ్స్ కారణంగా 2018 లో 196 ఆత్మహత్యలు జరగా, నేడు అవి 571 పెరిగాయి… NCB అంచనా ప్రకారం గంజాయి రవాణా లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.. 2021 లో దేశంలో పట్టుబడ్డ గంజాయిలో 26% రాష్ట్రంలోనే పట్టుబడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి…

రాష్ట్రంలో గంజాయి సరఫరా ముఠాలు విచ్చలవిడిగా కార్యకలాపాలు సాగిస్తుండగా, తూర్పుగోదావరి జిల్లాలో వారి కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది..

కొత్తపేట నియోజకవర్గ పరిధిలో సైతం గంజాయి అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తుంది… గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి కేంద్ర సంస్థలు నడుం కట్టాలని కోరుతున్నాం…

వైసిపి నేతల అక్రమ ధనార్జనకు అడ్డు అదుపు లేకుండా పోతుంది…

రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహంతో మాదకద్రవ్యాలుకు అలవాటు పడుతున్నారు…

 

బండారు సత్యానందరావు

రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు