Headlines

ఆలయ అభివృద్ధికి మరింత కృషి : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి…

కొత్తపేట : కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం కొత్తపేట నియోజకవర్గంలో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించనున్న అన్నప్రసాద భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 40 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.