పురందేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు ను ఖండించిన ఈతకోట తాతాజీ..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 14:

 

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని పలువురు బిజెపి నేతలు హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలోని ధన రెసిడెన్సీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరుని ఉద్దేశించి గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ట్రీట్లను బిజెపి నేతలు ప్రస్తావించారు. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగు చీలుస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మద్యం వల్ల ఆరోగ్య స్థితిగతులు దయనీయంగా మారాయని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న రాష్ట్ర అధ్యక్షురాలు పురందరిశ్వరుని వ్యక్తిగతంగా మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు శైలిని ఖండించారు. జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు .తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరుని ఒక్క మాటైనా అంటే నాలుక తీరుస్తామని హెచ్చరించారు. ఆమె ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి గాని వ్యక్తిగత విమర్శలకు దారి తీయడం సమంజసం కాదు నీతో పలికారు గతంలో కూడా సోము వీర్రాజు పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. పురందర ఈశ్వరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసే సమయంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆమెను పొగిడారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆమె ద్వారా చేయించుకున్నారని సోమేశ్వర గుర్తు చేశారు. విజయ్ సాయి రెడ్డి చేస్తున్న ట్రీట్లకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో అయిదు నెలల్లో కాలచక్రం తిరుగుతుందని ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు .వైసీపీ నాయకులు బిజెపి తో పెట్టుకోవద్దని ఒక దశలో సోమేశ్వరావు హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వారు వచ్చే నిధులతో చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తన పేరు వాడుకుంటుందని తెలిపారు. ఓబిసి మోర్చ కార్యదర్శి అయినం బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మద్యం బాండ్లకు త్రీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్ మెడల్ ఇటువంటి పేర్లు పెట్టి కల్తీ మద్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రామారావు ,తాడేపల్లిగూడెం నియోజకవర్గం కో కన్వీనర్ రామగారి సత్యనారాయణ, పెంటపాడు మండల అధ్యక్షులు దత్తు ప్రసాదు బండి శ్రీనివాస్ పార్టీ నాగేశ్వరరావు బి ఎల్ నారాయణ మారిశెట్టి నరసింహమూర్తి చిట్యాల రాంబాబు గరగ ప్రసాద్ పాల్గొన్నారు.